గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

  • క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి
  • రైతుల ఆందోళనలపైనా చర్చ!
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదనపై సీఎం రెండు జిల్లాల నేతలతో చర్చించారు. రాజధానిలో రైతుల ఆందోళనపైనా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. కాగా, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సీఎం జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు.
Go Back to Shorts
Guntur District
Krishna District
YSRCP
Jagan
Andhra Pradesh
Amaravathi

More Telugu News